Delhi, Aug 16: బీజేపీ - బీఆర్ఎస్ విలీనంపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్..మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం పక్కా అని తేల్చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు నలుగురు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు.. వాళ్ల విలీనంతో కవితకు బెయిల్ వస్తుందని జోస్యం చెప్పారు.
ఆలస్యమైన బీజేపీలో బీఆర్ఎస్ ఎప్పటికైనా విలీనం కావాల్సిందేనని చెప్పారు. ఇక విలీనం తర్వాత బీఆర్ఎస్ నేతలకు వచ్చే పదవులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు రేవంత్. గవర్నర్‌గా కేసీఆర్, కేంద్రమంత్రిగా కేటీఆర్, రాజ్యసభకు కవిత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి హరీష్ రావుకు దక్కుతుందన్నారు. దీంతో రేవంత్ ఇప్పుడు ఢిల్లీలో చేసిన కామెంట్స్ తెలగాణ రాజకీయాల్లో కాక పుట్టించాయి.
వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందనే టాక్ నడుస్తోంది. వరుసగా ఎన్నికల్లో ఓటములు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు వెరసీ సంక్షోభంలో ఉంది బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీటు కూడా లేకపోవడం ఇదే తొలిసారి. రాజ్యసభలో మాత్రం నలుగురు సభ్యులు బీఆర్ఎస్‌కు ఉన్నారు. మీ విజన్ అద్భుతం..సీఎం రేవంత్‌రెడ్డికి ఫాక్స్ కాన్ సీఈవో కితాబు, త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తా, పెట్టుబడులు పెడుతానని వెల్లడించిన యంగ్ లియూ
Here's Tweet:
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది.. ఎప్పటికైనా జరిగేది ఇదే.
కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, కవితకు రాజ్యసభ సీటు, హరీశ్‌రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్.
ప్రస్తుతం బీఆర్ఎస్‌కు నలుగురు నలుగురు రాజ్యసభ… pic.twitter.com/Mv8k9M0miK
— BIG TV Breaking News (@bigtvtelugu) August 16, 2024
ఈ నేపథ్యంలోనే ఇటీవల కేటీఆర్ - హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. దీంతో బీజేపీ- బీఆర్ఎస్ విలీనంపై వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఖండించిన కేటీఆర్...తప్పుడు ప్రచారం చేసే సంస్థలు, పేపర్లపై లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటూ బీజేపీ నేతలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం తాము పేపర్‌లోనే చదివామని చెప్పారు. దీంతో బీజేపీ - బీఆర్ఎస్ విలీనం వార్తలకు చెక్ పడగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌తో మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.