తెలంగాణ మంత్రి వర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి చోటుదక్కింది. రాజ్‌భవన్‌లో ఆయన మంత్రిగా ప్రమాణాస్వీకారం చేశారు. మహేందర్‌రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. అసెంబ్లీ టికెట్‌ను ఆశించిన మహేందర్‌రెడ్డిని రాజీ ఫార్ములాలో భాగంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో 2021 మే నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో మహేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. కాగా తాండూరు బీఆర్‌ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే.
Here's Video
తెలంగాణ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డి pic.twitter.com/IwPNjeyN5U
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)