తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చేందుకు హైదరాబాద్​లో గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమ్మిట్‌ నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.ఇందులో భాగంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేఏ పాల్ కలిశారు. అనంతరం ఇరువురు సదస్సుపై చర్చించారు. అక్టోబరు 2న హైదరాబాద్​లో ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని కేఏ పాల్ తెలిపారు. సదస్సుకు హాజరు కావాలని ఇన్వెస్టర్లను కోరుతూ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉమ్మడిగా వీడియో పాల్ విడుదల చేశారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు తెచ్చేలా సదస్సు నిర్వహణ చేస్తానని హామీ ఇచ్చారు.కేఏ పాల్​ అధ్యక్షతన నిర్వహిస్తున్న ప్రపంచశాంతి, ఆర్థిక సదస్సుకు పెట్టుబడు దారులను ఆహ్వానిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)