తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు కోకా కోల సంస్థ ప్రకటించింది. తాజాగా సిద్దిపేట జిల్లాలోని తన ప్లాంట్‌లో అదనంగా 647 కోట్ల పెట్టుబడికి నిర్ణయం తీసుకుంది.  అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన కోకాకోల సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్ మేక్ గ్రివి ఈ మేరకు ప్రకటించారు. వరంగల్ లేదా కరీంనగర్ ప్రాంతంలో తన రెండో నూతన తయారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణలో తన పెట్టుబడులను రెట్టింపు చేయడం ద్వారా మొత్తంగా ఇప్పటిదాకా రాష్ట్రంలో 2500 కోట్లు పెట్టుబడి పెట్టిన కోకా కోల సంస్థ, చరిత్రలో ఇంత వేగంగా భారీ పెట్టుబడి, విస్తరణ చేయడం ఇదే మొదటిసారి.

Credits: X

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)