హైదరాబాద్ నగరంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక వేలుకి ఇరుకున్న రింగ్ ను 10 గంటలు పాటు శ్రమించి తొలగించారు గౌలిగూడ అగ్నిమాపక సిబ్బంది.హైదరాబాద్‌ టోలిచౌకి ప్రాంతానికి చెందిన దీపిక ఆడుకుంటూ ఓ స్టీల్ రింగ్‌ను వేలికి పెట్టుకుంది. తీద్దామంటే రాకపోవడంతో తల్లిదండ్రులు బాలికను దగ్గరలోని హాస్పిటల్, గోల్డ్ స్మిత్ వద్దకు తీసుకెళ్లిన ప్రయోజనం లేదు. ఫైర్ సిబ్బంది బాలిక వేలుకున్న రింగ్‌ను కట్ చేసి తొలగించారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

పట్టపగలు అందరూ చూస్తండగానే దారుణ హత్య.. మేడ్చల్ జిల్లాలో యువకుడిని హతమార్చిన దుండగులు, వైరల్ వీడియో

మరో ఘటనలో  వరకట్నపు వేధింపులతో పాటు భర్త అక్రమ సంబంధంతో మనస్తాపానికి గురై పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో భర్త తిరుపతి వరకట్నపు వేధింపులు, వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురై.. ఈనెల 14న ఇద్దరు పిల్లలకు గడ్డి మందు తాగించి, తాను తాగి ఆత్మహత్య చేసుకుంది భార్య హారిక.

10 గంటల పాటు శ్రమించి రింగ్‌ను కట్ చేసి తొలగించిన ఫైర్ సిబ్బంది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)