గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. పార్సీగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. తెల్లవారుజామున మొదలైన వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది.సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.వరద కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రాంనగర్ లో స్కూటీపై వెళుతున్న వ్యక్తి వరదనీటిలో పడిపోయాడు. వరదనీటి ప్రవాహానికి కొద్దిదూరం కొట్టుకుపోయాడు. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, కుండపోత వర్షానికి నదులను తలపిస్తున్న రోడ్లు
Here's Videos
Heavy Night Downpour Plunges Hyderabad into Chaos: One Dead, Vehicles Washed Away, and Widespread Flooding
A relentless downpour during the night and early hours of Tuesday brought Hyderabad to a standstill, causing one fatality, washing away vehicles, and leading to widespread… pic.twitter.com/i9fITOzkfI
— Sudhakar Udumula (@sudhakarudumula) August 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)