హైదరాబాద్‎లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం (Hyderabad Rains) కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం పడుతోంది. హైదరాబాద్‎లోని సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జులై 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలిక పాటి వానలు పడవచ్చని అంచనా వేసింది.ఈ మేరకు కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీచేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)