హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో బుధవారం హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదైంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఓ బౌన్సర్‌ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన తారక్‌రామ్‌ (30) మాదాపూర్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మరో బౌన్సర్‌ రాజుతో కలిసి జూబ్లీహిల్స్‌ మీదుగా సికింద్రాబాద్‌ వెళ్తున్నాడు.

ఈ క్రమంలో పెద్దమ్మగుడి కమాన్‌ సమీపంలో మలుపు వద్ద వేగంగా వెనుక నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో తారక్‌రామ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చొన్న రాజుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ కేసును వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)