హైదరాబాద్ నగరంలోని మీర్‌పేటలోని జిల్లెలగూడలో అదృశ్యమైన బాలుడు మహీధర్‌రెడ్డి ఆచూకీ తిరుపతిలో లభ్యమైంది. ఈ నెల 4న ట్యూషన్‌కు వెళ్లిన బాలుడు.. ఆ తర్వాత కనిపించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. మలక్‌పేటలో రైలు ఎక్కి తిరుపతి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల సాయంతో బాలుడి ఆచూకీ కనుగొన్నారు.తిరుపతిలో బాలుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాడు. అయితే అక్కడ భక్తులు అనుమానించి బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడించారు. ఫోన్ రావడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మీర్పేట్ పోలీసులు తిరుపతిలోని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమని తెలిపారు. తెలంగాణలో మరో మిస్సింగ్ కేసు, ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న బాలుడి కిడ్నాప్?, సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలు

మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు కథనం ప్రకారం.. జిల్లెలగూడ దాసరినారాయణరావు నగర్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డికి మౌనేందర్‌రెడ్డి, మహీధర్‌రెడ్డి(13) ఇద్దరు కుమారులు. మహీధర్‌రెడ్డి మీర్‌పేటలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు ఇద్దరు అన్నదమ్ములు మీర్‌పేటలో ట్యూషన్‌కు వెళ్తుంటారు. ఈనెల 4న (ఆదివారం) సాయంత్రం సోదరుడితో ట్యూషన్‌కు వెళ్లారు. మహీధర్‌రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ నాలుగు బృందాలను రంగంలోకి దింపారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి ఆచూకీ కనుగొన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)