మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జీనోమ్ వ్యాలీలోని ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మంగళవారం ఉదయం దగ్ధమైంది. బస్సును ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది.. దీంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు ఎగసిపడ్డాయి. బైక్ తో పాటు బస్సు కూడా మంటల్లో పూర్తిగా కాలిపోయింది. మంటల్లో చిక్కుకున్న బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బస్సులోని ఉద్యోగులు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. మృతి చెందిన సంపత్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ములుగు మండలం వరదరాజపురం అని పోలీసులు తెలిపారు.
Here's IANS Tweet
A man was killed after a bike he was riding collided with a private bus coming from the opposite direction at Shameerpet in Medchal Malkajgiri district on the outskirts of #Hyderabad, and both the vehicles were gutted in the incident. pic.twitter.com/HFSh9J4pAU
— IANS (@ians_india) August 22, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)