తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు, పోలీసులు రంగంలోకి దిగి సచివాలయాన్ని పరిశీలించారు. కానీ అది ఫేక్ కాల్ అని ఎలాంటి బాంబు లేదని తెలిసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు SPF పోలీసులు. ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో ఇదిగో, అన్నోజీ గూడా ఫ్లైఓవర్ మీద కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, క్షణాల్లోనే దగ్ధమైపోయిన కారు
ఇక మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్న లంగర్ హౌజ్ కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ.. దర్గాకు సంబంధించి ఓ సమస్య పై ప్రభుత్వానికి తాను అర్జి పెట్టుకున్నానని, అధికారులు స్పందించక పోవడంతో అధికారులకు బెదిరింపు కాల్ చేశానని తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించిన ఎస్పీఎఫ్ పోలీసులు. పోలీసులు, సెక్రటేరియట్ అధికారులతో వాగ్వాదానికి దిగిన ఫోన్ చేసిన వ్యక్తి. ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న సైఫాబాద్ పోలీసులు.
Bomb Threat at Telangana Secretariat:
తెలంగాణ సెక్రటేరియట్ ను పేల్చి వేస్తానని బెదిరింపులు
మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్న లంగర్ హౌజ్ కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ
దర్గాకు సంబంధించి ఓ సమస్య పై ప్రభుత్వానికి తాను అర్జి పెట్టుకున్నానని, అధికారులు స్పందించక పోవడంతో అధికారులకు బెదిరింపులు
ఫోన్ చేసిన వ్యక్తిని… pic.twitter.com/ycNPHpJJns
— RTV (@RTVnewsnetwork) February 4, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)