హైదరాబాద్ నగరంలోని గోల్కొండ బడబజార్‌లో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న అనస్ అహ్మద్(2) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. టోలిచౌకికి చెందిన నజీర్ బాషా మనవడు మంగళవారం రాత్రి 9. 45 నిమిషాలకు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన కుక్కల గుంపు బాలుడిపై దాడి చేసింది. విషయాన్ని గమనించిన స్థానికులు కుక్కలను తరిమి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాల పాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)