హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌ నుంచి నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 26 మంది ప్రయాణికులతో బయల్దేరిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు(కావేరీ) మిర్యాలగూడ వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లైఓవర్‌ వద్ద ఒక్కసారిగా టైరు పేలి బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. బుధవారం అర్ధరాత్రి దాటాక 2:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ ప్రయాణికులను నిద్రలేపి బస్సు నుంచి బయటకు పంపించాడు.

అదే సమయంలో సమాచారం అందుకున్న పెట్రోలింగ్‌ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపారు. ఈ ఘటనలో ఫ్లైఓవర్‌ పక్కనే ఆగి ఉన్న ఉల్లిగడ్డలోడు లారీకి మంటలు వ్యాపించి సరకు స్వల్పంగా దగ్ధమైంది. ఈ మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు యాజమాన్యం ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.

Bus Fire (Photo-Video Grab)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)