హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్‌లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)కి చెందిన చెత్త ఊడ్చే వాహనం బీభత్సం సృష్టించింది. చెత్త ఊడ్చే వాహనాన్ని డ్రైవర్ రోడ్డుపై నిలిపి ఉంచాడు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వాహనం ముందుకు కదిలింది. వాహనం అదుపుతప్పి రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాన్ని ఆపే క్రమంలో జీహెచ్‌ఎంసీ వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
వీడియో ఇదిగో, ఘట్‌కేసర్ వద్ద కారులో మంటలు, బయటకు వచ్చే అవకాశం లేక ముగ్గురు సజీవ దహనం
GHMC vehicle lost control and rammed into vehicles
👉నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్ లో అదుపుతప్పి వాహనాలపై దూసుకెళ్లిన క్లీనింగ్ వాహనం.
👉వాహనాన్ని రోడ్డుపై ఆపి కిందికి దిగిన డ్రైవర్.
👉వాహనాన్ని ఆపే ప్రయత్నం క్రమంలో జిహెచ్ఎంసి డ్రైవర్ కు తీవ్ర గాయాలు. రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం. pic.twitter.com/t3Nb0B14rA
— ChotaNews App (@ChotaNewsApp) January 6, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)