హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ - షామీర్‌పేట్ పీఎస్ పరిధిలో బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు మహిళలను రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంతాయిపల్లి గ్రామానికి చెందిన గాయత్రి, భవానీలను తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు, పోలీసులతో కలిసి వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అంతాయ పల్లి గ్రామస్థులు ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మధిరలో దళిత యువకుల అరెస్ట్.. ప్రశ్నించిన సీపీఎం నేతలపై చేయి చేసుకున్న సీఐ.. ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎం నేతలు 

ఇద్దరు మహిళలను ఢీకొన్న రెడీమిక్స్ లారీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)