రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్‌ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాను వాహనాన్ని అతి వేగంగా వచ్చిన మారుతి బెలెనో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అయిదుగురు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలు అవ్వగా, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుక్కుగూడ నుంచి శంషాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఆటోని ఢీకొట్టిన భారీ ఐరన్ లోడ్‌ లారీ, ఒకరు మృతి, మరో 5 మందికి తీవ్ర గాయాలు

గురువారం సాయంత్రం తుక్కుగూడ నుంచి శంషాబాద్‌ వైపు వెళ్తోన్న ఓ కారు అదుపు తప్పి బెలెనో కారు, తుఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్‌ వాహనంలో ప్రయాణిస్తున్న రెండేళ్ల చిన్నారి, మహిళ, డ్రైవర్‌తో 5 మంది మృతిచెందారు. మరో 5 మందికి గాయాలయ్యాయి. బాధితులు యాదగిరిగుట్ట నుంచి వనపర్తి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)