జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణాలమీదకు వచ్చింది. లాకర్ గదిలోనే వృద్ధుడు కృష్ణారెడ్డిని ఉంచి బ్యాంకుకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం లాకర్ రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధుడిని సిబ్బంది గమనించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. బ్యాంక్ సిబ్బంది నిర్వాకంపై కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బ్యాంక్ మూసివేసే సమయంలో కనీసం గదులు తనిఖీ చేయకపోవడంపై మండిపడ్డారు. రాత్రంతా లాకర్ రూమ్‌లో కృష్ణారెడ్డి బిక్కుమంటూ గడిపారు. అన్నాపానీయాలు లేక స్పృహతప్పిపోయారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు సమాచారం. నిన్న సాయంత్రం అతను యూనియన్ బ్యాంక్ లాకర్స్ గదిలో ప్రమాదవశాత్తు బంధించబడ్డాడు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీసులు విజయవంతంగా అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించారని SHO JUBILEE HILLS రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)