హైదరాబాద్ - పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజాయుద్ధనౌక గద్దర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో నంది అవార్డులను ఇక నుంచి ‘గద్దర్ అవార్డు’ (Gaddar Award) పేరుతో ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నేడు జనవరి 31న గద్దర్ జయంతి కావడంతో ఆయనకి నివాళులు అర్పిస్తూ రేవంత్ రెడ్డి (Revanth reddy).. ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇదే నా శాసనం. ఇదే జీవో అంటూ ప్రకటించారు. త్వరలోనే ఈ పేరు మార్పు పై జీవోని జారీ చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ ప్రతీ జయంతికి ఈ పురస్కార ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇకపై ప్ర‌తీ సంవ‌త్స‌రం నంది అవార్డులు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌, పుర‌స్కారం పేరు మార్చుతూ త్వ‌ర‌లోనే జీవో జారీ

వీడియో ఇదిగో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)