ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీకి నాంప‌ల్లి కోర్టులో ఊర‌ట ల‌భించింది. అక్బరుద్దీన్ పై నమోదైన రెండు కేసులను కోర్టు కొట్టివేసింది. నిజామాబాద్, నిర్మ‌ల్‌లో అక్బరుద్దీన్ మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై అప్పట్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడా ఆ కేసులను నాంప‌ల్లిలోని ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు కొట్టివేసింది. ఓవైసీ విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు చేసిన‌ట్లు ఆధారాలు చూప‌లేద‌ని కోర్టు పేర్కొంది. ఈ నేప‌థ్యంలో అక్బ‌రుద్దీన్‌పై న‌మోదైన రెండు కేసుల‌ను కొట్టివేస్తున్న‌ట్లు కోర్టు వెల్లడించింది.

2012 డిసెంబర్‌లో నిజామాబాద్‌, నిర్మల్‌లో అక్బరుద్దీన్‌ పర్యటించిన సందర్భంగా ఆయన మతపరమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు రావడంతో కేసు న‌మోదైంది. ఈ కేసుపై విచారణను చేపట్టిన కోర్టు అనేక మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత నాంపల్లి సెషన్స్ కోర్టు బుధవారం తుది తీర్పు వెల్ల‌డించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)