ఆదివారం రాత్రి ట్యాంక్ బండ్ పై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో పెద్ద గొడవ జరిగింది. ఫరూక్ నగర్ డిపోనకు చెందిన డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు యువకులు అమానుషంగా దాడి చేసారు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరూ క్రికెట్ బ్యాట్ తో కండక్టర్ రమేష్ ఎడమ చెయ్యి విరగ్గొట్టగా, డ్రైవర్ షేక్ అద్బుల్ కి తీవ్రమైన గాయాలు అయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించిన యువకులిద్దరి పేర్లు హ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలుగా పోలీసులు గుర్తించి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసారు.కాగా బస్సులో అధికంగా ఆడవాళ్లు ఉండడం తో ఈ యువకులిద్దరిని బస్సు ఎక్కనివ్వడానికి అనుమతించలేదు. ఆ కారణం చేత ఈ ఇద్దరు యువకులు వారిపై దాడికి దిగినట్లుగా తెలుస్తోంది.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)