షేక్ ముజమ్మిల్ అహ్మద్ అనే భారతీయ విద్యార్థి కెనడాలో గుండెపోటుతో మరణించాడు. కొడుకు మరణవార్త విన్న అతని కుటుంబం మా బిడ్డ అస్థికలను తిరిగి హైదరాబాద్‌కు పంపించేలా ఏర్పాటు చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌ను అభ్యర్థించింది.హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ (25) ఒంటారియోలోని కిచెనర్ సిటీలోని వాటర్‌లూ క్యాంపస్‌లోని కోనెస్టోగా కాలేజీలో ఐటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. డిసెంబ‌ర్ 2022 నుంచి మాస్ట‌ర్స్ చ‌దువుతున్నాడు.  ఢిల్లీలో రైతుల నిరసనలో విషాదం, గుండెపోటుతో జ్ఞాన్ సింగ్ అనే రైతు మృతి, శంభు సరిహద్దులో జరిగిన నిరసనలో పాల్గొన్న తరువాత ఛాతి నొప్పితో విలవిల

అయితే గత వారం నుండి అహ్మద్ జ్వరంతో బాధపడుతున్నాడని, అయితే గుండె ఆగిపోవడంతో అహ్మద్ మరణించాడని అతని స్నేహితుడి నుండి అతని కుటుంబానికి కాల్ వచ్చిందని MBT నాయకుడు అమ్జద్ ఉల్లా ఖాన్ చెప్పారు. సహాయం కోసం EAM జైశంకర్‌ను అభ్యర్థిస్తూ విద్యార్థి కుటుంబం రాసిన లేఖను కూడా తెలంగాణా రాజకీయ పార్టీ మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) నాయకుడు పోస్ట్ చేశాడు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)