మంత్రి కేటీఆర్ నేడు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో ఐటీ ట‌వ‌ర్‌తో పాటు ప‌లు అభివృద్ది ప‌నుల ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా దిక్కుమాలిన పార్టీల‌కు అవ‌కాశం ఇస్తే నెత్తురు కారే రోజులు తీసుకొస్తారు. మతం మంటల్లో ఉండే తెలంగాణ కావాల్నా.. ప‌చ్చ‌ని పంట‌ల‌తో ఉండే తెలంగాణ కావాల్నా.. రైతులు, ప్ర‌జ‌లు ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు. గుజ‌రాతోళ్ల చెప్పులు మోసేటోళ్లు మ‌న రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. గుజరాతీ గులామ్‌లు ఇక్క‌డ ఉన్నారు. కానీ రోషం ఉన్న తెలంగాణ బిడ్డ‌లు, పాల‌మూరు పౌరుషంతో ఉండే త‌మ్ముళ్లంతా ఆలోచ‌న చేయాలి. ఎవ‌రు ఈ రాష్ట్రానికి మంచివారు. ఎవ‌రి వ‌ల్ల ఈ రాష్ట్రంలోని రైతు బాగుప‌డుతాడు అనే విష‌యాన్ని ఆలోచించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)