Hyderabad, April 23: తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith Shah Tour) పర్యటనపై సెటైర్లు వేశారు. పునాది వేసినందుకు హెచ్‌ఎం అమిత్ షా జీకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్‌.. రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏమీ లేదని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఐటీఐఆర్‌ మంజూరు చేయలేదని, పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదని పరోక్షంగా సెటైర్లు వేశారు. హైదరాబాద్‌ మెట్రో రెండో దశ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీ, ఐఐటీ, ఎన్‌ఐడీ, నవోదయ, మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు ఇవ్వలేదంటూ వంగ్యాస్త్రాలు (Ktr Satirical Tweet) సంధించారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాన్ని చూపించగలరా అంటూ సవాల్‌ విసిరారు. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి చేవేళ్ల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్‌షాను ట్యాగ్‌ చేస్తూ కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)