Nalgonda, Aug 25: నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జగిత్యాల నుంచి దర్శి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) అదుపుతప్పి బోల్తా కొట్టింది. అద్దంకి, నార్కెట్ పల్లి ప్రధాన రహదారిపై వేములపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులోని 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్రేన్ సాయంతో పోలీసులు ప్రయాణీకులను బయటకు తీశారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా..
నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా
స్వల్పగాయాలతో బయట పడిన 30 మంది ప్రయాణికులు
బస్సు డ్రైవర్ మృతి
జగిత్యాల నుండి దర్శి కి వెళ్తున్న బస్సు
జేసీబీ, క్రేన్ సహాయంతో బస్సును… pic.twitter.com/boBpWL3aQt
— Telangana Awaaz (@telanganaawaaz) August 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)