Revanth Reddy Posters Viral: సోనియా బలిదేవత, రాహుల్ ముద్దపప్పు అంటూ రేవంత్ రెడ్డి ఫొటోతో బంజారాహిల్స్ లో పోస్టర్ల కలకలం
హైదరాబాద్ లో రెండు రోజులుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు జరుగుతున్నాయి. అయితే సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో హైదరాబాద్‌లో పలు చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు, కటౌట్లు వెలవడం చర్చనీయాంశమైంది.
Hyderabad, Sep 17: హైదరాబాద్ (Hyderabad) లో రెండు రోజులుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ-CWC) సమావేశాలు జరుగుతున్నాయి. అయితే సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో హైదరాబాద్ లో పలు చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు (Posters), కటౌట్లు వెలవడం చర్చనీయాంశమైంది. తాజాగా బంజారాహిల్స్ లో మరోసారి రేవంత్ రెడ్డి ఫొటోతో వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. సోనియాగాంధీని బలి దేవత, రాహుల్ గాంధీని ముద్దపప్పు అంటూ వారికి స్వాగతం పలుకుతున్నట్టు రేవంత్ రెడ్డి ఫొటోలతో ఉన్న పోస్టర్లు బంజారాహిల్స్ కనిపించాయి. రేవంత్, కాంగ్రెస్ అంటే గిట్టని వాళ్లు ఇలాంటి పోస్టర్లు రూపొందించి అతికించినట్టు తెలుస్తోంది.
బంజారాహిల్స్ లో మరోసారి రేవంత్ రెడ్డి ఫొటో తో పోస్టర్ లు కలకలం
సోనియాగాంధీని బలి దేవత అని రాహుల్ గాంధీని ముద్దపప్పు అని గతంలో అన్న మాటలు పోస్టర్ రూపంలో దర్శనం
ముద్దపప్పు, బలి దేవతకు స్వాగతం అంటూ వెలిసిన పోస్టర్లపై సర్వత్రా చర్చ.#CWC2023 #CWCMeeting #CWC23 #CWCMeetingHyd pic.twitter.com/WDjEAjahdT
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 17, 2023 02:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

