Hyderabad, Sep 3: భారీ వర్షాలతో (Heavy Rains) తెలంగాణ (Telangana) అతలాకుతలం అవుతున్నది. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు రూ.100 కోట్ల‌ను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వ‌చ్ఛందంగా నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ వి ల‌చ్చిరెడ్డి తెలిపారు. తెలంగాణలో కురుస్తున్న వ‌ర్షాల‌తో భారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిందని ఆయన అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. జూనియర్ ఎన్టీఆర్‌ భారీ విరాళం.. ఒక్కో రాష్ట్రానికి రూ. 50 లక్షల చొప్పున సాయం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)