MLA Rajaiah Crying Video: వీడియో ఇదిగో, టికెట్ దక్కకపోవడంతో భోరున ఏడ్చేసిన రాజయ్య, కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని స్పష్టం చేసిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే
అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ దక్కకపోవడంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. టికెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ దక్కకపోవడంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. టికెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు.కాగా ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరపున మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీ చేయనున్నారు
టికెట్ దక్కకపోయినప్పటికీ.. అధినేత కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. ‘‘బీఆర్‌ఎస్‌లోలో చేరినప్పటి నుండి కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నా. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.. అందరూ సమన్వయం పాటించండి. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దు’’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేక్రమంలో.. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో కార్యకర్తలు సైతం ఆయన్ని పట్టుకుని విలపించారు.

Here's Video
ఈసారి టికెట్ రాకపోవడం తో కన్నీళ్లు పెట్టుకున్న తాటికొండ రాజయ్య... pic.twitter.com/fhiL7OEq7X
— keshaboina sridhar (@keshaboinasri) August 22, 2023
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని బోరున ఏడ్చిన తాటికొండ రాజయ్య pic.twitter.com/laPuei9HKL
— Telugu Scribe (@TeluguScribe) August 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 22, 2023 03:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

