రూ.69 వేల కోట్ల అంచనా వ్యయంతో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు కనెక్టివిటీని మొత్తం 400 కి.మీలకు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు నిర్ణయించినందుకు సీఎం కేసీఆర్‌కి, మంత్రివర్గ సహచరులకు ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కొత్తగా వచ్చే మెట్రో కారిడార్లను పేర్కొన్నారు.
కొత్త మెట్రో కారిడార్లు ఇవే..
ఓఆర్‌ఆర్ మెట్రో
జేబీఎస్ నుంచి తూముకుంట
ప్యాట్నీ నుంచి కండ్లకోయ,
ఇస్నాపూర్ నుంచి మియాపూర్
మియాపూర్ నుంచి లక్డికాపుల్
ఎల్‌బీ నగర్ నుంచి పెద్ద అంబర్‌పేట్
ఉప్పల్ నుంచి బీబీనగర్
తార్నాక నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్
ఎయిర్‌పోర్ట్ నుంచి కందుకూరు (ఫార్మా సిటీ)
షాద్‌నగర్ మీదుగా శంషాబాద్ (ఎయిర్‌పోర్ట్)
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)