తెలంగాణ అసెంబ్లీ ఎన్పికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదలైంది. ఇప్పటికే 114 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. 2023, నవంబర్ 9వ తేదీ గురువారం సాయంత్రం పెండింగ్ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, పటాన్ చెరు స్థానాన్ని ఏఐసీసీ మార్చింది. నీలం మధుకు కేటాయించిన పటాన్ చెరు సీటును.. కట్ట శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. అలాగే, తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ కు అదిష్టానం షాకిచ్చింది. ఆ స్థానాన్ని ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మందుల సామ్యూల్ కు కేటాయించారు.
తాజాగా ప్రకటించిన అభ్యర్థులు:
సూర్యాపేట: రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
పటాన్ చెరు: కట్ట శ్రీనివాస్ గౌడ్
మిర్యాలగూడ: బత్తుల లక్ష్మారెడ్డి
తుంగతుర్తి: మందుల సామ్యుల్ (ఎస్సీ)
చార్మీనార్: మహ్మద్ ముజీబ్ ఉల్ షీర్
Here's List
The Central Election Committee has selected the following persons as Congress candidates for the ensuing elections to Telangana Assembly.👇🏼 pic.twitter.com/UUCfAtqFUM
— Congress (@INCIndia) November 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)