తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు ఎక్కడికక్కడే తనిఖీలు ముమ్మరం చేశారు. నగదు రూ. 50 వేలు దాటితే దానికి సంబంధించిన పత్రాలు తప్పకుండా చూపించాల్సిందే. అయితే ఇలా లెక్క చూపకుండా నగదు తీసుకువెళుతున్న వారి నుంచి నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు లెక్కా పత్రం లేని 40 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. CZ టాస్క్‌ఫోర్స్ బృందం అబిడ్స్‌ పీఎస్‌ పరిధిలోని రామకృష్ణ థియేటర్‌ పార్కింగ్‌ స్థలంలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.40 లక్షల లెక్కలు చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్, గర్భిణీ మహిళపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన డాక్టర్, నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)