COVID in TS: గ్రేటర్ హైదరాబాద్‌ను వణికిస్తున్న కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,452 కొత్త కేసులు నమోదు, తెలంగాణలో గత 24 గంటల్లో 2,295 మందికి కోవిడ్
తెలంగాణలో కరోనా కల్లోలం రేపుతోంది. గడచిన 24 గంటల్లో 64,474 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 2,295 మందికి పాజిటివ్ గా తేలింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,452 కొత్త కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కల్లోలం రేపుతోంది. గడచిన 24 గంటల్లో 64,474 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 2,295 మందికి పాజిటివ్ గా తేలింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,452 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 232, రంగారెడ్డి జిల్లాలో 218 కేసులు గుర్తించారు. అటు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
అదే సమయంలో 278 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 4,039కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,89,751 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,75,851 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఈ నేపథ్యంలో, యాక్టివ్ కేసుల సంఖ్య 9,861కి పెరిగింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.07.01.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/PSQfH5fmJ8
— IPRDepartment (@IPRTelangana) January 7, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 07, 2022 08:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

