కూకట్ పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చివేత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ తన పాత ఇంటిని బుధవారం కూల్చివేశారు.దానికి ముందు రోజే ఆ ఇంటిలో అద్దెకు ఉన్న అందరినీ ఖాళీ చేయించారు. ఉదయం పాక్షికంగా పనులు చేపట్టగా.. భోజన విరామం అనంతరం పూర్తిగా కూల్చివేశారు.

అయితే బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఖాళీ చేయించిన ఇంటికి వచ్చి లోపల నిద్రపోయాడు అద్దెకున్న వ్యక్తి. ఆ విషయం తెలియకుండా పూర్తిగా కూల్చివేయడంతో స్వామి రెడ్డి శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుల్లుగా తాగి హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన హల్ చల్ చేసిన యువకుడు, ముప్ప తిప్పలు పడి అతన్ని కిందకు దించిన పోలీసులు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)