హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫోన్ తిరిగి ఇవ్వాలని వేడుకున్న మయన్మార్‌ యువకుడిని ఓ రౌడీ షీటర్ తన అనుచరుడితో కలిసి కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. మయన్మార్‌కు చెందిన మొహ్మద్‌ ఇబ్రహీం(25) తల్లి తండ్రి హత్యకు గురికావడంతో 2017లో హైదరాబాద్‌ వచ్చాడు. బాలాపూర్‌ వాది ఎ సాలిహీన్‌ గ్రీన్‌సిటీలో నివాసముంటూ స్క్రాప్‌ వ్యాపారం చేస్తున్నాడు.

తన స్వస్థలానికి చెందినవారు స్థానికంగానే ఉండడంతో ఓ యువతిని రెండేళ్లక్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రస్తుతం 2 నెలల పాప ఉంది. ఇబ్రహీం నివాసముండే ప్రదేశానికి స్థానిక రౌడీషీటర్లు, దొంగలు, నేరస్థులంతా చేరుకుని.. వలస వచ్చిన బర్మా వాసులపై దౌర్జన్యాలకు దిగుతున్నారు.పదిరోజుల క్రితం తన సహచరుడు ఖయ్యూం(25)తో కలిసి ఆసిఫ్‌.. వాది ఎ సాలిహీన్‌కు చేరుకుని ఇబ్రహీం ఫోన్ ను బలవంతంగా తీసుకెళ్లాడు.తన ఫోన్ తిరిగి ఇవ్వాలని ఇబ్రహీం వారిని అడిగాడు. నన్నే అడుగుతావా? అంటూ వారు కత్తి తీసి ఇబ్రహీంను పొడిచి పారిపోయారు. కత్తిపోట్లకు గురైన ఇబ్రహీంను స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.  సికింద్రాబాద్‌ లో దారుణం.. డబ్బుల కోసం అర్ధ‌రాత్రి యాచ‌కుల‌పై దాడి.. ఒక‌రు మృతి

  Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)