తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నిరుద్యోగ మహాదీక్షకు రేవంత్ హాజరు కావడంపై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రేవంత్ మహాదీక్షకు హాజరు కానున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ ఇంటికి వెళ్లే దారులన్నీ మూసేశారు. రేవంత్ ఇంటికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
ఓయూ జేఏసీ (OU JAC) నేతృత్వంలో నేడు ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిరుద్యోగ మహా దీక్ష జరగనుంది. దీక్షకు ముఖ్య అతిథిగా హాజరై రేవంత్ రెడ్డి సంఘీభావం తెలపనున్నారు. పోలీసులు దీక్షకు అనుమతి లేదంటున్నారు. రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీకి (Osmania University) వెళ్ళకుండా అరెస్ట్ చేసేందుకు పోలీస్‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓయూకి వెళ్లి తీరతానని రేవంత్ చెబుతున్నారు. దీక్ష జరిగి తీరుతుందని ఓయూ విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ఓయూకు వస్తే రేవంత్‌ను అడ్డుకుని తీరుతామని బీఆర్ఎస్వీ హెచ్చరిస్తోంది.
Here's ANI Tweet
The United students union called for a protest today at the OU Arts College in relation to the TSPSC paper leak issue. Heavy police have been deployed at the residence of the TPCC Chief and barricades have been set up: Sridhar, ACP, Banjara Hills
— ANI (@ANI) March 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)