కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ప్రమాదం ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తలకొండపల్లి మండలం వెల్జార్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తుండగా.. గ్రామ శివారులో ఎమ్మెల్యే కారును ఓ బైకు ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నరేశ్‌ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరశురామ్‌ అనే మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతులను వెంకటాపుర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి కారు ధ్వంసమైంది. ఎయిర్‌ బెలూన్‌లు సకాలంలో తెరుచుకోవడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  ఈ రోడ్డు ప్రమాదం వీడియోపై మీ అభిప్రాయం చెప్పమంటున్న సజ్జనార్, తప్పు ఎవరిదో మీరే జడ్జి చేయమంటూ ట్వీట్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)