సిద్దిపేట - సికింద్రాబాద్ నుంచి దుబ్బాకకి బస్సు వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్న మహిళలు.సీటు తనదంటే తనదంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరూ చెప్పులు ఝులిపించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నారు. ఆ మధ్యలో ఉన్న ఓ మహిళ వాళ్లను నిలువరించే ప్రయత్నం చేయగా.. ఇంతలో మరో ఇద్దరు పురుషులు జోక్యంతో వివాదం సర్దుమణిగింది. ఆ గొడవను ప్రయాణికులంతా ఆసక్తిగా తిలకించగా.. అక్కడే ఉన్న కొందరు ఆ వీడియో తీయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తోగుట మండలం వెంకట్రావ్‌ పేట వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమచారం.

Here's Women Fight Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)