Hyderabad, March 17: ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో (Telangana) రేపు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తమ్మీద రానున్న 5 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఝార్ఖండ్ నుంచి చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ఒడిశా వైపు కదిలినట్టు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఈమేరకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, నిన్న వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప‌లు చోట్ల భారీ వ‌ర్షం( rain ) కురిసింది. మ‌ర్ప‌ల్లి మండ‌ల కేంద్రంలో వ‌డ‌గండ్ల వాన( Hailstorm ) ప‌డింది. వికారాబాద్, ప‌రిగి, పూడూరు మండ‌లాల్లో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)