ఆటో డ్రైవర్లు నిన్న కొత్తగూడెం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడిచేసిన సంగతి విదితమే. అలాగే ద్రాచలంలో మహిళా కండక్టర్‌ను మహిళా ప్రయాణికులు దూషించారు.ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీకి సిబ్బంది వెన్నెముక లాంటి వారని, వారి నిబద్ధత కారణంగా సంస్థ మనుగడ సాగిస్తోందన్న ఆయన వారిని దూషించడం, దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ ఎంతమాత్రమూ సహించబోదని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనలపై ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. ప్రయాణ సమయంలో ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతూ ఎక్స్ చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. బస్ కోసం వేచి చూసీచూసీ విసిగిపోయిన కొందరు ప్రయాణికులు ఇక లాభం లేదని ఆటోలు ఎక్కారు. అదే సమయంలో అక్కడకు బస్ రావడంతో వారంతా దిగిపోయి బస్ ఎక్కారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆటో డ్రైవర్లు బస్ డ్రైవర్ నాగరాజుపై దాడిచేశారు. ప్రయాణికులు, కండక్టర్ సరస్వతి ఎంత వారించినా వినిపించుకోలేదు. ఈ ఘటనపై కొత్తగూడెం డిపో మేనేజర్ వెంకటేశ్వరరావుతో కలిసి డ్రైవర్ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Here's Tweet
#TSRTC కి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్… pic.twitter.com/4PIOXQmAAX
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)