మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఇద్దర్నీ సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.గతకొద్ది రోజులుగా జూపల్లి, పొంగులేటి.. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖమ్మంలో తనవర్గం నేతలతో పొంగు లేటి భేటి అవుతున్నారు. కొత్తగూడెంలో ఆదివారం నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశంలోనూ జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. ఇద్దరు కలిసి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సింగరేణిని అప్పుల కుప్పగా మార్చారని, కార్మికులను అవమానించారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం, దాన్ని నడిపిస్తున్న సీఎం ఎనిమిదిన్నరేళ్ల కాలంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదన్నారు.
Here's ANI Tweet
Hyderabad, Telangana | As per orders of BRS National Chief K.Chandrashekar Rao, former Minister Jupalli Krishna Rao & former MP Ponguleti Srinivasa Reddy are suspended from the party for engaging in anti-party activities: Bharat Rashtra Samithi (BRS)
— ANI (@ANI) April 10, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)