Vikas Raj New CEO of TS: తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా వికాస్‌రాజ్‌, ఉత్త‌ర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి (సీఈఓ) పోస్టు గ‌త కొంత కాలంగా ఖాళీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టిదాకా ఆ పోస్టులో కొన‌సాగిన శ‌శాంక్ గోయ‌ల్ ఇదివ‌ర‌కే బ‌దిలీ కాగా.. తాజాగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ రాష్ట్రఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా నియ‌మిస్తూ కేంద్ర ఎన్నిల సంఘం బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Vikas Raj New CEO of TS: తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా వికాస్‌రాజ్‌, ఉత్త‌ర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Election Commission of India. File Image. (Photo Credits: PTI)

తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి (సీఈఓ) పోస్టు గ‌త కొంత కాలంగా ఖాళీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టిదాకా ఆ పోస్టులో కొన‌సాగిన శ‌శాంక్ గోయ‌ల్ ఇదివ‌ర‌కే బ‌దిలీ కాగా.. తాజాగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ రాష్ట్రఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా నియ‌మిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వికాస్ రాజ్‌.. ఉమ్మ‌డి ఏపీలో క‌ర్నూలు క‌లెక్టర్‌గా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఎండీగా కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ కేడ‌ర్‌ను ఎంచుకున్న ఆయ‌న ఇన్నాళ్లూ సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ (జీఏడీ) ముఖ్య కార్య‌ద‌ర్శిగా కొన‌సాగారు.

Vikas Raj appointed the New CEO of Telangana

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 17, 2022 12:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).