ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడి రూ.2 కోట్లు అప్పు చేసి.. తీర్చే మార్గం లేక సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. నల్లగొండ నెహ్రూగంజ్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న తడకమళ్ల సోమయ్య కుమారుడు సాయికుమార్ (28) అప్పు తెచ్చి ఆన్‌లైన్‌లో బెట్టింగ్ పెట్టి రూ.2 కోట్లు నష్టపోయాడు. వీడియో ఇదిగో, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం, అంబులెన్స్‌కు దారి ఇస్తూ యూలు బైక్‌ను ఢీకొట్టిన కారు
అప్పు లు ఇచ్చిన వారు.. తిరిగి చెల్లించాలని అడగడంతో వారికి సమాధానం చెప్పలేక సాయికుమార్ మనస్తాపం చెంది ఈ నెల 17న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. హాలియా వద్ద సాగర్ ఎడమ కాల్వలో దూకాడు. అతని సోదరుడు సతీశ్ అదేరోజు నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సాయికుమార్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కాగా సోమవారం సాయికుమార్ మృతదేహం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామ శివారులో సాగర్ ఎడమ కాల్వలో లభించినట్టు పెన్‌పహాడ్ ఎస్‌ఐ రవీందర్ తెలిపారు. మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Here's Video
నల్లగొండ జిల్లాలో బెట్టింగ్ మహమ్మారి కు బానిసై యువకుడు బలి.
అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో.హాలియా 14 మైళ్ళ కాలువలు దూకి అనుముల మండలం చెక్ పోస్ట్ దగ్గర కాలువలో తేలిన మృతదేహం. pic.twitter.com/ZYS2bNPJPd
— ChotaNews (@ChotaNewsTelugu) August 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)