వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. వీఐపీ రాహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో (Punjagutta police station) కేసు నమోదైంది. 333, 353,337 సెక్షన్ల కింద షర్మిలపై (YSRTP leader YS Sharmila) పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న(సోమవారం) టీఆర్‌ఎస్ నేతల దాడిలో (TRS Leaders) ధ్వంసమైన కారును తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు షర్మిల బయలుదేరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు.షర్మిలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమె భర్త అనిల్ ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. ‘ పాదయాత్ర చేయడం తప్పా?, నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది’ అని తెలిపారు.
Here's ANI Tweet
YSRTP Chief YS Sharmila's husband Anil Kumar arrives at SR Police station in Hyderabad to meet her after was detained from Somajiguda when she tried to go to Pragathi Bhavan to gherao Telangana CM’s residence
"We have every right to protest," he says. pic.twitter.com/ulecWgMWsw
— ANI (@ANI) November 29, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)