పుణేలో ఉన్న గూగుల్ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. గూగుల్ కార్యాలయంలో బాంబు పెట్టినట్లు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న గూగుల్ ఆఫీస్‌కు కాల్ రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి బాంబు లేకపోవడంతో గందరగోళం సద్దుమణిగింది.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న గూగుల్ కార్యాలయానికి ఆదివారం రాత్రి 7.54 గంటలకు కాల్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మద్యం మత్తులో ఈ కాల్ చేసినట్టు అధికారులు గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని అదుపులోకితీసుకున్నామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
Here's Update
Google Office in Pune on Alert After Receiving Hoax Bomb Call; Caller Arrested in #Hyderabad#Google #Pune @GoogleIndia https://t.co/jgfk1k7aOZ
— LatestLY (@latestly) February 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)