నెట్‌ఫ్లిక్స్‌ (Netflix ).. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ (Password Sharing) విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కుటుంబ సభ్యులతో మాత్రమే పాస్‌వర్డ్‌ను షేర్‌ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఫ్యామిలీ మెంబర్స్‌ ( single household) కాకుండా ఇతరులతో పాస్‌వర్డ్‌ షేర్‌ చేసుకుంటే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ఈ నిబంధనలు భారత్‌లో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయన్నది మాత్రం తెలియజేయలేదు.అమెరికాలో ఈ ఫీజును నెలకు 7.99 డాలర్లు కాగా, యూకేలో 4.99 యూరోలుగా నిర్ణయించినట్లు తెలిపింది. కాగా, కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడంలో భాగంగానే పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)