రిలయన్స్ జియో సేవలు మంగళవారం ఒక్కసారిగా నిలిచిపోయాయి. వినియోగదారులు కాలింగ్, మెసేజింగ్ వరకు పలు సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ విషయంపై పలువురు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. చాలా మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఉపయోగించగలిగినా ఫోన్‌కాల్స్ చేయలేకపోయినట్లు తెలిపారు. జియో సర్వీసులు నిలిచిపోవడంపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్‌గా మారాయి. మరోవైపు, ఓ యూజన్ తన మొబైల్‌లో ఉదయం నుంచి VoLTE సిగ్నల్ కనిపించడం లేదని, ఫోన్‌కాల్స్ చేయలేకపోయినట్లు ట్వీట్ చేశాడు. సాధారణ కాల్స్‌లో సమస్యలు ఉన్నప్పుడు 5జీ సేవలు ఎలా అందిస్తారని కంపెనీని ప్రశ్నించాడు. ప్రస్తుతం ట్విట్టర్‌లో #Jiodown ట్రెండ్ అవుతున్నది. అయితే, ఇప్పటి వరకు సర్వీసులు నిలిచిపోవడంపై కంపెనీ స్పందించలేదు.
#Jiodown situation when you have jio fiber , jio sim and jio mobile. And the network is down. pic.twitter.com/kI6vagk9SP
— AnishKumar Agarwal (@AnIsH_261290) November 29, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)