శ్రీహరికోటలో ప్రయోగించిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్ ప్రయోగం విజయవంత కావడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మూడు ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో విజయం సాధించడంపై సైంటిస్టులకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
కాగా, శ్రీహరికోట నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2.. మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. కాగా, 13 నిమిషాల 2 సెకన్లలో రాకెట్ ప్రయోగం పూర్తికానుంది. దీని ద్వారా 2 దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాయి.
Here's AP CMO Tweet
Andhra Pradesh Chief Minister Sri YS Jagan Mohan Reddy has congratulated ISRO team for the successful launch of SSLV-D2, propelling the nation's Space initiatives, and wished ISRO team and the youngsters associated with the project all success in future endeavours. https://t.co/x2sFOSibPB
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)