శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3 నింగికి ఎగిరింది. ఎల్ఎంవీ3 రాకెట్ ద్వారా ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి దిశగా దూసుకువెళ్లింది. మధ్యాహ్నం 2.35 నిమిషాలకు నిప్పులు చెరుగుతూ రాకెట్ గగనతలంలోకి పయనమైంది. ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ .. చంద్రుడి ఉపరితలంపై దిగే ఛాన్సు ఉంది.. ఇవాళ మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ గాలిలోకి ఎగిరింది. ఆ తర్వాత అన్ని దశల్లోనూ ఆ రాకెట్ బూస్టర్లు సక్రమంగా మండాయి. ల్యాండర్, రోవర్‌తో చంద్రయాన్-3 వెళ్తోంది. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ సంతోషం వ్యక్తం చేస్తూ, "కంగ్రాట్స్ ఇండియా" అన్నారు. ఇదిలా, చంద్రయాన్ 3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెడుతున్న నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సంబరాలు అంబరాన్నంటాయి.
ANI Video
#WATCH | ISRO chief S Somanath says, "Chandrayaan-3 has started its journey towards the moon. Our dear LVM3 has already put Chandrayaan-3 craft into the precise around earth...Let us wish all the best for the Chandrayaan-3 craft to make its farther orbit raising manoeuvres and… pic.twitter.com/S6Za80D9zD
— ANI (@ANI) July 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)