Dinosaur Eggs: కులదేవతగా భావించి ఏకబిగిన పూజలు.. చివరకు అవి డైనోసార్ గుడ్లని తెలిసింది.. ఎక్కడ?
మధ్యప్రదేశ్ లోని ధార్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తాటికాయ సైజున్న రాతి బంతులను చాలా ఏండ్లుగా కొందరు గ్రామస్థులు కులదేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తూ పూజిస్తున్నారు.
Bhopal, Dec 20: మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని ధార్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తాటికాయ సైజున్న రాతి బంతులను (Stone Balls) చాలా ఏండ్లుగా కొందరు గ్రామస్థులు కులదేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తూ పూజిస్తున్నారు. ఇటీవల ఆ ప్రాంతాలను సందర్శించిన పరిశోధకులు అనుమానంతో పరీక్షలు జరుపగా గ్రామస్థులు ఇన్నాళ్లూ పూజలు జరుపుతున్నది డైనోసార్ శిలాజ గుడ్లుగా (Dinosaur Eggs) నిర్ధారించారు. డైనోసార్ టైటనాసార్ జాతికి చెందిన శిలాజ గుడ్లుగా వీటిని గుర్తించారు. దీంతో గ్రామస్థులు అవాక్కయ్యారు.
Dinosaur eggs found in Dhar district Madhya Pradesh India were found that for years villagers were worshiping as God gift https://t.co/xmo6HuwFDE
— Prof A.K.Srivastava (@srivastava019) December 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 20, 2023 08:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

