కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వరంగల్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో, బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్దకు చేరుకోగానే సంజయ్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లతో దాడికి చేశారు.
కాగా, ఈ దాడులకు పాల్పడిందని కాంగ్రెస్ కార్యకర్తలేనని బండి సంజయ్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, గుడ్ల దాడి నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గుడ్లు విసిరిన వారి గుర్తించాలని డిమాండ్ చేశారు. కోడిగుడ్ల దాడితో అసహనం చెంది పోలీసు బందోబస్తు నాకు ఏమీ వద్దు.. మీరు వెళ్లిపోవాలని బండి సంజయ్ పోలీసులకు తెలిపారు.
Here's Video
బండి సంజయ్ మీద కోడి గుడ్ల దాడి
కోడిగుడ్ల దాడితో అసహనం చెంది పోలీసు బందోబస్తు నాకు ఏమీ వద్దు.. మీరు వెళ్లిపోవాలని చెప్పిన బండి సంజయ్.
వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ప్రజాహిత యాత్ర చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బండి సంజయ్ కాన్వాయ్ మీద గుడ్లు విసిరారు. pic.twitter.com/U6AwJAs5nJ
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)