Newdelhi, Sep 10: సూర్యుడి (Sun) రహస్యాలు ఛేదించేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య-ఎల్1’ (Aditya L1) వ్యోమనౌక కక్ష్యను ఇస్రో (ISRO) నేడు మూడోసారి పెంచింది. బెంగళూరులోని టెలీమెట్రి, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ కేంద్రం(ఇస్‌ ట్రాక్) నుంచి ఈ కక్ష్య పెంపును చేపట్టింది. తాజా కక్ష్య మార్పుతో, ఈ మిషన్ తన గమ్యం దిశగా మరో ముందడుగు వేసినట్టైంది. ప్రస్తుతం ఆదిత్య ఎల్1 భూమి చుట్టూ 296 కి.మీ బై 71,767 కి.మీ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తోందని ఇస్రో వెల్లడించింది. సెప్టెంబర్ 15న రాత్రి 2.00 గంటల సమయంలో మరోమారు కక్ష్య పెంపు చేపడతామని ఇస్రో ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

Pawan Kalyan Arrest: పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)